![]() |
![]() |

బుల్లితెర మీద రష్మీ ఒక స్టార్ యాంకర్. సుడిగాలి సుధీర్ తో కలిసి రష్మీ హోస్ట్ చేసిందంటే చూసే ఆడియెన్స్ లో వచ్చే ఆ హుషార్ వేరు. జబర్దస్త్ యాంకర్ గా మంచి సక్సెస్ ని అందుకుంది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరించే అవకాశాన్ని అందుకుంది. ఇలా బుల్లితెరపై సూపర్ సక్సెస్ అందుకున్న రష్మీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన లక్ ని పరీక్షించుకుంది. కొన్ని మూవీస్ లో నటించి ఒక మోస్తరు సంపాదించుకుంది. కానీ అనుకున్నంత సక్సెస్ రాలేదు. బుల్లితెర మీద వచ్చినంటే పేరు సిల్వర్ స్క్రీన్ మీద రాలేదు. ఏదైనా ఒక్క మూవీ ఐనా బ్రేక్ ఇచ్చి ఉంటె రష్మీ ఈపాటికి బుల్లితెర మీద కనిపించేదే కాదు. బుల్లితెరపై సుడిగాలి సుదీర్ తో కలిసి చేసిన స్కిట్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు, అన్నట్టు ఆడియన్స్ లో ఒక మాయను సృష్టించారు. వీళ్ళిద్దరూ నిజంగా లైఫ్ లో పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా ఆడియన్స్ అనుకున్నారంటే ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎంతగా వర్కౌట్ అయ్యిందో వేరేగా చెప్పక్కర్లేదు.
ఐతే ఈ మధ్యలో ఎవరి దిష్టి తగిలిందో ఇద్దరూ వేరైపోయారు.. సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వేరే షోస్ కి యాంకర్ గా వెళ్ళిపోయాడు. అవి పూర్తయ్యాక సినిమాల్లో నటించడానికి వెళ్లి రష్మీకి దూరమైపోయాడు. కానీ ఆడియన్స్ మాత్రం ఈ జోడి అస్సలు వదల్లేదు. ఐతే రష్మీ ఏజ్ పెరిగిపోతుంది..దాంతో అందరూ కూడా పెళ్ళెప్పుడు అని ప్రతీ సందర్భంలో అడుగుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రష్మీ తన పెళ్ళెప్పుడు అని అడుగుతున్న వాళ్లకు ఒకటే సమాధానం ఇచ్చారు డిసెంబర్ 31 న తన పెళ్లి విషయం చెప్తాను అని చెప్పింది. న్యూ ఇయర్ రాబోతుండడంతో "రష్మీ పెళ్లి పార్టీ" అంటూ ఓ స్పెషల్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్మీ తన పెళ్లి విషయాన్ని ప్రకటించడం కోసం ముహూర్తం నిర్ణయించారు... ఆ ముహూర్తం ఎప్పుడు అనే విషయానికి వస్తే డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9:30 నిమిషాలకు తన పెళ్లి పెళ్లికి సంబంధించిన విషయాలను ప్రకటిస్తానని ఈ ప్రోమోలో చెప్పింది. అయితే ఇదంతా న్యూ ఇయర్ షోలో ఒక భాగంగానే విషయం అర్థమైపోతుంది.
![]() |
![]() |